వెంకీ మామని చంపేస్తార?


Venky Mama
Venky Mama

“విక్టరీ వెంకటేష్” గారిని  ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటాం, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గరనుండి, కుర్రకారు, మధ్య వయస్సు, అమ్మాయిలు, ఆంటీలు ఇలా ఒక్కలేంటి అందరిని మెప్పించే సినిమాలు మాత్రమే చేస్తారు. నిజానికి టాలీవుడ్ లో ఎక్కువ హిట్లు ఉన్న మూవీస్ అంటే కూడా వెంకీ మామ పేరు ముందు ఉంటుంది అది ఆయనకి మాత్రమే సొంతం.

అయితే ఈ ఏడాది “వరుణ్ తేజ్” తో కలిసి చేసిన బ్రోమాన్సు “F2″ సినిమా కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఆ సినిమా ని సూపర్ హిట్ చేశారు అందుకే విక్టరీ అయ్యింది ఆయన ఇంటి పేరు.

అయితే వెంకీ మామ ఇప్పుడు విచిత్రం గా ”వెంకీ మామ” అని అదే పేరుతో సినిమా చేస్తున్నాడు, బహుశా ఈ సినిమాకి ఆ పేరు పెట్టడానికి కారణం మేనమామ గండం చుట్టూ తిరుగుతుంది అని అందుకే ఆ పేరు పెట్టారు అని అందరూ అనుకున్నారు, అదే నిజం అయ్యింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా చివరి దశకు చేరుకుంది, చివరిలో మేనమామ గండం వల్ల వెంకటేష్ గారు చనిపోయే సన్నివేశం ఉందని అది చెయ్యాల్సిందే అని దర్శకుడు “బాబీ (కె.ఎస్.రవీంద్ర)” గారు చెప్పడం తో ఒక్కసారి టీం అందరూ షాక్ అయ్యారు అంటా, నిజానికి ముందు స్టోరీ అనుకున్నప్పుడు చనిపోయే సన్నివేశం లేదు అని అన్నారంటా, తీరా ఇప్పుడు ఆ సన్నివేశం చెయ్యాల్సిందే అని దర్శకుడు దగ్గరినుండి అందరి అభిప్రాయం.

నిర్మాత “సురేష్ బాబు” ఇది ఆలోచించి తీసుకోవాల్సిన విషయం అని కొంత సమయం తీసుకున్నారంటా, మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.