వెంకీ మామ ఇక దంచికొట్టుడే


వెంకీ మామ ఇక దంచికొట్టుడే
వెంకీ మామ ఇక దంచికొట్టుడే

కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోయింది. వెంకీ మామ రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇది అందరికీ తెల్సిన విషయమే. అయితే వెంకీ మామ విడుదలను కన్ఫర్మ్ చేయడానికి చాలానే మల్లగుల్లాలు పడాల్సి వచ్చింది. దసరా నుండి దీపావళి అటు నుండి సంక్రాంతి, మళ్ళీ వెనక్కి క్రిస్మస్ అంటూ ఇన్ని డేట్లు మారి చివరికి డిస్కషన్ల మీద డిస్కషన్లు చేసి మొత్తానికి డిసెంబర్ 13న రిలీజ్ అని ఫిక్స్ చేసారు. అయితే ఈ ప్రకటన చాలా ఆలస్యంగా వచ్చిందనే చెప్పాలి. కేవలం 11 రోజుల ముందే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చేసాయి కాబట్టి టైమ్ కు విడుదల చేసేయొచ్చు అనుకున్నారు. అయితే ఒక సినిమాకు పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేయడానికి ఈ సమయం సరిపోతుందా అంటే డౌటే. అందుకే వెంకీ మామ టీమ్ రిలీజ్ ముందర వరకూ ప్రమోషన్స్ లో ప్రేక్షకులను ముంచి తేల్చేయనున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన రోజు నుండి వరసగా పోస్టర్స్ వదులుతున్న టీమ్ ఇప్పుడు ట్రైలర్ ను కట్ చేయిస్తున్నారు. దీంతో పాటు ఫుల్ సాంగ్స్ ఆల్బమ్ ను కూడా రెండు, మూడు రోజుల్లో దించనున్నారు. ఇక విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

చాలా కాలం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం కావడం, అందులోనూ నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఈ సినిమాలో అవే పాత్రలు చేస్తున్నారు. నాగ చైతన్య కూడా సురేష్ ప్రొడక్షన్స్ హీరోనే. ఈ నేపథ్యంలో వెంకీ మామ ఎలాగైనా హిట్ చేయాలని టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులోనూ ఈ సినిమా విడుదలయ్యేది వెంకటేష్ పుట్టినరోజున. తన కెరీర్ లో ఇప్పటివరకూ వెంకీ పుట్టినరోజుకి సినిమా విడుదలయ్యింది లేదు. సో ఇది కచ్చితంగా వెంకటేష్ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ డే. ఈ రకంగా చూసినా కూడా వెంకీ మామ కచ్చితంగా హిట్ అవ్వాలి. ఇవన్నీ పక్కనపెడితే వెంకీ మామకు విపరీతమైన బడ్జెట్ అయింది. దాదాపు 50 కోట్ల వరకూ పెట్టించాడు దర్శకుడు బాబీ. వెంకటేష్, నాగ చైతన్య మార్కెట్లు కలిపితే ఆ ఫిగర్ వస్తుంది. అంటే సినిమా ఎఫ్ 2 తరహాలో భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అందుకే వెంకీ మామ సినిమాను చాలా స్పెషల్ గా తీసుకున్నారు టీమ్ మొత్తం.