వెంకీ మామ ఒక్క పాట మాత్రమే..


Venky Mama
వెంకీ మామ ఒక్క పాట మాత్రమే..

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య మామాఅల్లుళ్లుగా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయ్యిందిట. ఒక్క పాట షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ పాట కూడా త్వరలో పూర్తి చేసి ఫస్ట్ కాపీ వీలైనంత తొందర్లో రెడీ చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు.

నిజానికి ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే మొదట భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ డేట్ మిస్ అయింది. నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు, ఫస్ట్ కాపీ రెడీ చేసి పెట్టుకుని విడుదల ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు విడుదల చేయాలని భావిస్తున్నాడు. ‘మేనల్లుడి వల్ల మేనమామకు ప్రాణగండం వస్తే?’ అన్న కాన్సెప్ట్ పై వెంకీ మామ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు.