వెనక్కి తగ్గే ఆలోచనలో వెంకీ మామ


వెనక్కి తగ్గే ఆలోచనలో వెంకీ మామ
వెనక్కి తగ్గే ఆలోచనలో వెంకీ మామ

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సంక్రాంతి సినిమాల గురించే చర్చ నడుస్తోంది. ఒకేరోజు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు విడుదలవుతుండడం, సంక్రాంతికి ఏకంగా 5 చిత్రాలు వస్తుండడంతో అప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయితే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకేరోజు విడుదలవడానికి కారణం వెంకీ మామ అని తెలుస్తోంది.

మొదట డిసెంబర్ లో విడుదల కావాల్సిన వెంకీ మామ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేయాలని సురేష్ బాబు నిర్ణయించడంతో హడావిడిగా ఈ రెండు చిత్రాలు ఒకేరోజున విడుదల తేదీలను ప్రకటించాయి. మరోవైపు వెంకీ మామ చిత్రాన్ని జనవరి 11 లేదా 14న విడుదలవుతుందని మొదట భావించారు.

అయితే ఇప్పుడు సురేష్ బాబు వెంకీ మామ రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అంత రష్ మధ్య సంక్రాంతికి విడుదల కావడం కరెక్టేనా అని సురేష్ బాబు ఆలోచిస్తున్నాడు. ముందు అనుకున్నట్టు చిత్రాన్ని డిసెంబర్ కే తెస్తే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నాడట. మరి వెంకీ మామ రిలీజ్ ను బట్టి సంక్రాంతి సినిమాలు మళ్ళీ షెడ్యూల్ చేసుకుంటాయేమో చూడాలి.