వెంకీ మామ టైటిల్ లోగో వచ్చేసింది


విక్టరీ వెంకటేష్ , నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ” వెంకీ మామ ”. పవన్ , జై లవకుశ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర ( బాబీ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ . రేపు ఉగాది పర్వదినం కావడంతో వెంకీ మామ లోగో ని రిలీజ్ చేసారు . ఈ చిత్ర లోగో చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం . లోగో లో ఒకవైపున పల్లెటూరి వాతావరణం ఉండగా మరోవైపు యుద్ధ వాతావరణం ఉంది దాంతో మరింత ఆసక్తికరంగా ఉంది .

వెంకటేష్ సరసన ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తోంది . ఎఫ్ 2 తో ఇటీవలే సంచలన విజయం సాధించిన వెంకటేష్ మంచి జోష్ మీదున్నాడు . ఒకవైపు పెద్ద హిట్టు ఆ తర్వాత కూతురి పెళ్లి తో వెంకటేష్ పరమానందభరితుడవుతున్నాడు . ఇక నాగచైతన్య నటించిన మజిలీ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఈ ఉగాది నిజంగా పెద్ద పండగే వాళ్ళిద్దరికీ .