అమ్మైనా … నాన్నైనా నువ్వేలే వెంకీ మామా…!


అమ్మైనా ... నాన్నైనా నువ్వేలే వెంకీ మామా...!
అమ్మైనా … నాన్నైనా నువ్వేలే వెంకీ మామా…!

ఒక్క పాటలో

· మేనమామ కి అల్లుడికి ఉండే అనుబంధం

· వాళ్ళిద్దరి మధ్య ఉండే సరదాలు

· వాళ్ళు ఉండే ప్రదేశం తాలూకు నేటివిటి

· నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన వెంకటేష్ మరియు నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు

ఇవన్నీ కలిపి మళ్లీ వినే అభిమానులకు అర్థమయ్యే ఈ విధంగా చాలా సున్నితమైన పదాలతో పాట రాశాడు అంటే ఆయన పేరు రామజోగయ్య శాస్త్రి. వెంకటేష్ మరియు నాగచైతన్య మల్టీస్టారర్ మూవీ “వెంకీ మామ” సినిమా ట్రైలర్ సాంగ్ రిలీజ్ అయింది. జై జవాన్ – జై కిసాన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే అభిమానులు ఆశిస్తున్నారు. రవితేజతో పవర్ అనే సినిమాకి డైరెక్టర్ బాబీతో కలిసి పనిచేసిన మన థమన్ అన్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.

ప్రస్తుతం రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ను జూనియర్ బాలసుబ్రమణ్యం గా పిలిచే శ్రీ కృష్ణ, అరవింద సమేత సినిమాలో “ఊరికి ఉత్తరాన” పాటతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మోహన భోగరాజు ఆలపించారు. జైలవకుశ లాంటి హైలెవెల్ ఎమోషనల్ సినిమా తర్వాత k.s రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల ఈ సినిమాకి D.O.P గా పనిచేస్తున్నారు. రంగస్థలం సినిమా లో అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసిన రామకృష్ణ మౌనిక దంపతులు ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్స్. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ప్రస్తుతం రిలీజ్ అయిన పాట నిజంగా వ్యక్తిగత జీవితంలో మేనమామ ప్రేమ అంటే ఏమిటో తెలిసిన వాళ్లకి ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది.