భీష్మకు ప్రధాన బలం – పరిమళ్


 

Vennela Kishore huge plus for Bheeshma
Vennela Kishore huge plus for Bheeshma

నితిన్ నటించిన భీష్మ పెద్ద సక్సెస్ అయింది. సంక్రాంతి తర్వాత నెల రోజుల పాటు సరైన హిట్ లేని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త సందడి తీసుకొచ్చింది భీష్మ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే దాదాపు 19 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం అంటే మాములు విషయం కాదు. కథ పాతదే అయినా సినిమా అంతా హాయిగా సాఫీగా సాగిపోతూ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచి పెట్టింది. వినోదం విషయంలో ఢోకా లేకపోవడంతో భీష్మ ప్రేక్షకుల చేత బ్రహ్మాండమైన మార్కులు వేయించుకుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా లాభాల్లోకి కూడా అడుగుపెట్టనుంది.

భీష్మ సినిమాలో కామెడీకి ఢోకా లేకపోయినా అందులో మేజర్ క్రెడిట్ మాత్రం వెన్నెల కిషోర్ కే దక్కుతుంది. సరైన పాత్ర పడితే ఎంతలా చెలరేగిపోతాడో అన్న దానికి భీష్మ సరైన ఉదాహరణగా నిలుస్తుంది. అందులోనూ ఫ్రస్ట్రేట్ అయ్యే పాత్ర పడితే ఇక వెన్నెల కిషోర్ కు తిరుగుండదు. భీష్మలో నితిన్ పక్కనే ఉంటూ ఫ్రస్ట్రేషన్ చూపించే పాత్రలో వెన్నెల కిషోర్ చెలరేగిపోయాడు. కడుపుబ్బా నవ్వించాడు.

హీరో వల్ల ఫ్రస్ట్రేట్  అవుతూ అతని వల్లే ఇబ్బందుల్లో పడే పాత్రలో కిషోర్ కామెడీ చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. పెద్ద ఉద్యోగం సైతం వదులుకుని చివరికి డ్రైవర్ గా సెటిల్ అయ్యే పాత్రలో కిషోర్ నటనను ఎంత పొగిడినా తక్కువే. వెన్నెల కిషోర్ ఇప్పుడు టాప్ కమెడియన్ గా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. మొనాటనస్ పాత్రలు వస్తున్నా కానీ తన నటనతో ఆ ఫీలింగ్ కలగకుండా చేయడంలో కిషోర్ తిరుగులేదు అనిపిస్తున్నాడు. గత రెండు మూడేళ్ళ నుండి కిషోర్ కు తిరుగులేకుండా ఉంది. చూస్తుంటే 2020 కూడా వెన్నెల కిషోర్ హవా చూపించనుండవచ్చు.