ఇప్పుడు వేణుమాధవ్ కుటుంబ పరిస్థితేంటి?


Venu Madhav
Venu Madhav

సినిమా వాళ్ళ జీవితాలు నిలకడ లేనివిగా ఉంటాయి. ఒకరోజు బిజీగా ఉన్న ఆర్టిస్ట్ మరొకరోజు పనిలేకుండా ఉండే అవకాశాలున్నాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత సినిమా వాళ్లకు సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం వేణుమాధవ్ అకాల మరణంతో వారి కుటుంబ పరిస్థితి ఏంటా అన్న చర్చ సినిమా వాళ్ళల్లో వచ్చింది.

వేణుమాధవ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఏమైనా వెనకేసాడా? లేక చాలా మందిలా దానాలకి, వాటికీ వీటికీ ఖర్చు చేసేసాడా?? వేణుమాధవ్ ఆర్ధిక పరిస్థితిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలు ఆరా తీయగా అతను ముందుచూపు ఉన్నవాడని తెలిసింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనకొచ్చిన డబ్బులను ఇళ్ళు కొనుగోలు చేయడంపై, భూమిపై పెట్టినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ ఈసీఐఎల్ నుండి మౌలాలి వరకు వేణుమాధవ్ 10 ఇళ్ళు కొనుగోలు చేసాడట. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందట. సినిమాల్లోకి వెళ్తే నాశనమైపోతావ్ అన్న తండ్రి మాటలను అబద్ధం చేయడానికి వేణుమాధవ్ ముందుచూపుతో ఫ్యామిలీని సెటిల్ చేసాడని అంటున్నారు. ఇదే ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటోంది.