టాలీవుడ్ లో నయా సంచలనానికి తెరలేపనున్న యంగ్ డైరెక్టర్

Venu udugula hopes on Virataparvam 1992మూస ధోరణిలో వెళుతున్న టాలీవుడ్ కి సరికొత్త అడుగులు నేర్పుతున్నారు టాలీవుడ్ నయా డైరెక్టర్ లు . ఇక సృజనాత్మకతని మరింతగా వంటబట్టించుకున్న తెలంగాణ దర్శకులు టాలీవుడ్ ని సరికొత్త మార్గంలో పయనించేలా చేస్తున్నారు . టాలీవుడ్ సినిమా అనగానే 5 ఫైట్లు , ఆరు పాటలు కొన్ని కామెడి సీన్లు , ఐటెం సాంగ్ అని భ్రమపడే స్థాయి నుండి వాస్తవ జీవితాలకు దగ్గరగా సినిమాని తీసుకెళ్తున్నారు కొత్త దర్శకులు అందునా తెలంగాణ కు చెందిన పలువురు దర్శకులు మరింతగా రాటుదేలి సృజనాత్మకత ఏ ఒక్కరి సొత్తూ కాదు అంటూ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు . ఇప్పటికే ఆ కోవలో పలువురు దర్శకులు సత్తా చాటగా తాజాగా వేణు ఊడుగుల అనే యువ దర్శకుడు టాలీవుడ్ లో నయా సంచలనానికి తెరలేపుతున్నాడు విరాటపర్వం 1992 చిత్రంతో .

నీది నాది ఒకే కథ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకున్నాడు . మూస ధోరణిలో సినిమాలు తీయడం ఇష్టంలేని వేణు తాజాగా సరికొత్త అంశాన్ని స్పృశించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు . సాహిత్యం పై అందునా తెలంగాణ సాహిత్యం పై మంచి పట్టున్న ప్రతిభాశాలి వేణు దాంతో 1990 నాటి కాలంలో తెలంగాణాలో ఉన్న అప్పటి పరిస్థితులను కథా వస్తువుగా చేసుకొని విరాటపర్వం 1992 పేరుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఈ విరాటపర్వంతో టాలీవుడ్ లో నయా ట్రెండ్ మొదలవ్వడం ఖాయమని , రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఈ సినిమా చర్చంశానీయం కావడం ఖాయమని ధీమాగా ఉన్నాడు . టాలీవుడ్ ని సరికొత్త కుదుపులకు లోనయ్యేలా చేసిన వాళ్ళలో దాస్యం తరుణ్ భాస్కర్ , సందీప్ రెడ్డి వంగా ఉండగా తాజాగా ఆలిస్ట్ లోకి వేణు చేరనున్నాడు .

English Title: Venu udugula hopes on Virataparvam 1992