ఎక్స్‌క్లూసివ్ : `ఆహా`కోసం వేణు ఊడుగుల‌!

Venu udugula planing web series for aha
Venu udugula planing web series for aha

భార‌తీయ డిజిట‌ల్‌ మార్కెట్‌ని శాసించాల‌ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి బ‌హుళ జాతి సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. భార‌త్‌లోకి ఎంట‌రైన ఈ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్‌ ఇప్న‌టికే ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదిలోనూ పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. మేజ‌ర్ షేర్‌ని త‌మ సొంతం చేసుకోవాల‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. ఇప్ప‌టికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో అమెజాన్ ప్రైమ్ పాగా వేసేంద‌కు మేజ‌ర్ షేర్ కొల్ల‌గొట్టేందుకు భారీ స్కెచ్‌ని సిద్ధం చేసి అమ‌లు ప‌ర‌చ‌డం మొద‌లు పెట్టింది.

దీని ద్వారా సినిమాల‌పై ప్ర‌భావం ప‌డుతుండ‌టంతో భారీ నిర్మాణ సంస్థ‌లు సొంతంగా డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్‌ని ఏర్పాటు చేసుకునే ప్ర‌య‌త్నాల్లో వున్నారు. ఇందులో భాగంగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో డిజిట‌ల్ యాప్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఉగాది రోజున భారీ లెవెల్లో ఈ యాప్‌ని ప్రారంభించ‌బోతున్నారు. దీని కోసం ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఓ వెబ్ సిరీస్‌ని చేయ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న Tollywood.netకు వెల్ల‌డించారు. అయితే ఆయ‌న చేయ‌బోతున్న వెబ్ సిరీస్ ఎలా వుండ‌మోతోంది?, కంటెంట్‌ ఏ నేప‌థ్యంలో వుంటుంద‌న్న వివ‌రాల్ని మాత్రం ఆయ‌న వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంది. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల `విరాట‌ప‌ర్వం` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. రానా హీరోగా న‌టిస్తున్నఈ చిత్రం చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. స‌మ్మ‌ర్‌కు చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.