మ‌ణిర‌త్నంనే ఆట‌ప‌ట్టించిందిగా!


Vetaran actress Radhika comedy on Maniratnam
Vetaran actress Radhika comedy on Maniratnam

తెలుగు, త‌మిళ భాష‌ల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు రాధిక‌. పెళ్లి త‌రువాత కూడా న‌ట‌న‌ని కొన‌సాగిస్తున్నారామె. తాజాగా భర్త శ‌ర‌త్ కుమార్‌తో క‌లిసి ఆమె ఓ త‌మిళ చిత్రంలో న‌టించారు. వానం `కోట్టాటుమ్‌` పేరుతో ధ‌న శేఖ‌ర‌న్ రూపొందించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు చెందిన మ‌ద్రాస్ టాకీస్ నిర్మించింది. సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇటీవ‌ల ఈ చిత్ర ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం చెన్నైలోని స‌త్యం సినిమాస్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీనియ‌ర్ న‌టి రాధిక ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంపై చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 1985లో వ‌చ్చిన `పాగ‌ల్ నిల‌వు` చిత్రం కోసం త‌న‌ని ఎందుకు తీసుకున్నార‌ని. స‌భాముఖంగా మ‌ణిర‌త్నంని  అడ‌గ‌డంతో అంతా అక్క‌డున్న వారంతా న‌వ్వేశారు.

మ‌ణిర‌త్నం తాజాగా `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఆ పాత్ర‌లో ముందు తానే న‌టిస్తాన‌ని, మ‌ణిర‌త్నంని అడిగాన‌ని, అందుకు ఆయ‌న నీకంటే ఐశ్వ‌ర్యారాయ్ టూ ఇంచెస్ హైట్ వుంద‌ని చెప్పార‌ని, ఆ కార‌ణంగానే `పొన్నియిన్ సెల్వ‌న్‌`లో అవ‌కాశాన్ని పోగొట్టుకున్నాన‌ని రాధిక చెప్ప‌డంతో ఆడియో సత్యం సినిమాలు న‌వ్వుల‌తో నిండిపోయింది. ముందు రాధిక మాట‌లు అర్థం కానీ ఆడియ‌న్స్ ఆ త‌రువాత తేరుకుని న‌వ్వుల్లో మునిగిపోయారు.