నటి ని రేప్ చేసిన కేసులో బిజినెస్ మెన్ అరెస్ట్


Veteran actress Zeenat Aman registers rape complaint against businessman80 వ దశకంలో కుర్రకారు ని ఓ ఊపు ఊపేసిన నటి జీనత్ అమన్ ని రేప్ చేసిన కేసులో ముంబై బిజినెస్ మెన్ అమర్ ఖన్నా ని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు . జీనత్ తనపై అమర్ అనే వ్యక్తి అత్యాచారం చేసాడని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ అప్పట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు . మళ్ళీ మళ్ళీ ఫిర్యాదు చేయడమే కాకుండా కొన్ని సాక్ష్యాలను కూడా పోలీసులకు అందజేయడంతో ఎట్టకేలకు స్పందించారు .

తనపై అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా సుమారు 15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు , నగదు ని బెదిరించి తీసుకున్నట్లు ఆరోపిస్తోంది జీనత్ అమన్ . హరే రామ హరే కృష్ణ , యాదోంకి బారాత్ , డాన్ , హీరా పన్నా , థ గ్రేట్ గ్యాంబ్లర్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఓ ఊపు ఊపేసింది జీనత్ .