అగ్రెసివ్ గా సినిమాలను నిర్మిస్తున్న విభు ప్రొడక్షన్స్


అగ్రెసివ్ గా సినిమాలను నిర్మిస్తున్న విభు ప్రొడక్షన్స్
అగ్రెసివ్ గా సినిమాలను నిర్మిస్తున్న విభు ప్రొడక్షన్స్

వెబ్ పోర్టల్ గా తన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగిస్తున్న విభు ప్రొడక్షన్స్ షార్ట్ ఫిలిమ్స్ రంగంలో కూడా రాణిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ డ్రామాస్ నిర్మించిన అనుభవంతో ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది విభు ప్రొడక్షన్స్. ఈ సంస్థ నిర్మిస్తోన్న మొదటి చిత్రం 4 లక్డికాపూల్స్ అండ్ 1 మాదాపూర్ ఇన్ వైజాగ్ సినిమా. లాక్ డౌన్ తర్వాత మొదలైన షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది.

దీపావళి పండగ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చాలా కొత్తగా ప్రయోగాత్మకంగా ఉంది. 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్ లో చెప్పారు. సాయిరామ్ దాసరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

షకీలాతో లేడీస్ నాట్ అలోవ్డ్ వంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సాయిరామ్ తెరకెక్కించిన 9వ చిత్రం ఈ 4 లక్డికాపూల్స్ అండ్ 1 మాదాపూర్ ఇన్ వైజాగ్ సినిమా.

శివ దోసకాయల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డీబీజి సంగీతం అందించారు. ప్రవీణ్ టాంటాం ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.