`కోలు కోలు..` లిరిక‌ల్ వీడియో వ‌చ్చేసింది!

`కోలు కోలు..` లిరిక‌ల్ వీడియో వ‌చ్చేసింది!
`కోలు కోలు..` లిరిక‌ల్ వీడియో వ‌చ్చేసింది!

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సాంగ్స్‌కి సంబంధించిన స్ర‌మోష‌న్స్‌ని మొద‌లుపెట్టేసింది. తాజాగా సాయి ప‌ల్ల‌విపై చిత్రీక‌రించిన `కోలు కోలు..` అంటూ సాగే మెలోడీ గీతానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని హీరో విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేశారు. ఈ పాట నా మైండ్‌లో ఫిక్స‌యిపోయింది. ఇలాంటి పాట‌ని రిలీజ్ చేయ‌డం ఆనందంగా వుంది` అని ట్వీట్ చేశారు.

ఈ పాట‌కు చంద్ర‌బోస్ సాహిత్యం అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించి దివ్య మ‌ల్లిక‌తో క‌లిసి ఆల‌పించారు. వెన్నెల త‌న మ‌న‌సు దోచినవాడి గురించి చెప్పే ప్ర‌య‌త్నంలో వ‌చ్చే పాట‌గా ఈ పాట వుంటుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.