ది రైజ్ ఆఫ్ `మోస‌గాళ్లు` థీమ్ మ్యూజిక్‌ రిలీజ్‌!‌


ది రైజ్ ఆఫ్ `మోస‌గాళ్లు` థీమ్ మ్యూజిక్‌ రిలీజ్‌!‌
ది రైజ్ ఆఫ్ `మోస‌గాళ్లు` థీమ్ మ్యూజిక్‌ రిలీజ్‌!‌

మంచు విష్ణు గ‌త చిత్రాల‌కు భిన్నంగా చేస్తున్న చిత్రం `మోస‌గాళ్లు`. ఓ భారీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇందులో మంచు విష్ణుకు సిస్ట‌ర్‌గా క‌నిపించ‌బోతోంది. జెఫ్రీ గీచిన్ డైరెక్ట్ చేస్తున్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ది రైజ్ ఆఫ్ మోస‌గాళ్లు థీమ్ మ్యూజిక్‌ని సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ రిలీజ్ చేశారు.

భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త పంథాలో నిర్మిస్తున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ హాలీవుడ్ స్టైల్లో తెర‌కెక్కుతోంది. భార‌త్‌లో మొద‌లై అమెరికాను వ‌ణికించిన అతిపెద్ద ఐటీ కుంభ‌కోణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ద్వారా బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి విల‌న్‌గా స‌రిచ‌యం అవుతున్నార‌ట‌.

కొత్త పంథాలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌వ‌దీప్‌, న‌వీన్‌చంద్ర‌, రుహీసింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి షెల్డ‌న్ చౌ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.