విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో `మోస‌గాళ్లు`!

విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో `మోస‌గాళ్లు`!
విక్ట‌రీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో `మోస‌గాళ్లు`!

మంచు విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం `మోస‌గాళ్లు`. జెఫ్రీ గీచిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ డ్యాన‌ర్‌పై మంచు విష్ణు హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో హీరో మంచు విష్ణుకు చెల్లెలిగా క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్‌ని విక్ట‌రీ వెంక‌టేష్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

ఆ త‌రువాత ఈ మూవీ కాన్సెప్ట్‌ని రివీల్ చేస్తూ టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన విష‌యంమ తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి విక్ట‌రీ వెంక‌టేష్ మ‌రో బాధ్య‌త‌ల‌ను నిర్తిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయ‌న వాయిస్ ఓవ‌ర్‌ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పాత్ర‌ల ప‌రిచ‌యం తో పాటు సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు స్టోరీని వెంక‌టేష్ నెరేట్ చేయ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం శుక్ర‌వారం వెల్ల‌డించింది. దీంతో `మోస‌గాళ్లు` టీమ్ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో దూకుడు చూపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌, వెంక‌టేష్ ఈ ఇద్దరు హీరోలు ఈ చిత్రానికి స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంటుంద‌ని టాక్‌. సునీల్‌శెట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్‌గా సంచ‌ల‌నం సృష్టించిన ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో రూపొందుతోంది.