విక్ట‌రీ వెంక‌టేష్ `దృశ్యం 2` ప్రారంభం!

 

Victory Venkatesh's Drushyam 2 Is Launched
Victory Venkatesh’s Drushyam 2 Is Launched

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన `దృశ్యం` సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం పొందిన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్‌కి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ
బాక్సాఫీస్ వ‌ద్ద వెంక‌టేష్ న‌టించిన చిత్రాల్లో మంచి వ‌సూళ్ల‌ని సాధించింది. ఇటీవ‌ల మోహ‌న్‌లాల్ న‌టించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా `దృశ్యం2`ని రూపొందించారు. మోహ‌న్‌లాల్‌కు జోడీగా మీనా న‌టించిన ఈ సీక్వెల్ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ని అదే పేరుతో విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా `దృశ్యం 2` రీమేక్‌ని మంగ‌ళవారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు. ఈ చిత్ర ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఆశీర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై డి. సురేష్‌బాబు, ఆంటోనీ పెంబ‌వార్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విక్టరీ వెంక‌టేష్, మీనా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని మిగ‌తా కీల‌క పాత్ర‌ల్లో న‌దియా, న‌రేష్‌, ఏస్త‌ర్‌, అనిల్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ఛాయాగ్ర‌హ‌ణం స‌తీష్ కురూప్‌. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈనెల 5 నుంచి ప్రారంభం కాబోతోంది.