లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి రేపు ఓ వీడియో సాంగ్


Video song from lakshmi's ntr

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కావడంతో ఆ సినిమాని మరింతగా దెబ్బ కొట్టడానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని ఓ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు రాంగోపాల్ వర్మ . నిన్న భారీ ఎత్తున ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు దాంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కూడా డిజాస్టర్ అని తెలుస్తోంది .

 

ఇక పూర్తిస్థాయి ఫలితం ఎలా ఉంటుందనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది సరిగ్గా ఈ సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట రిలీజ్ చేయడం అంటే తప్పకుండా ఎన్టీఆర్ మహానాయకుడు పై కక్ష్య తీర్చుకోవడమే ! ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లు , టీజర్ లు వదులుతున్నాడు కానీ సినిమా ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియడం లేదు .

 

English Title: Video song from lakshmi’s ntr