విద్యాబాల‌న్ రెచ్చిపోయిందిగా!


విద్యాబాల‌న్ రెచ్చిపోయిందిగా!
Courtesy : Instagram ( Vidya Bala )

బాలీవుడ్‌లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ డ‌బ్బూ ర‌త్నాని. ఇత‌ను ప్ర‌తీ ఏడాది రూపొందించే క్యాలెండ‌ర్ ఫొటో షూట్ లు బాలీవుడ్‌తో పాటు దేవ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తుంటుంది. తాజాగా 2020 కి గానూ డ‌బూ ర‌త్నాని చేసిన బాలీవుడ్ తార‌ల న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్ ఫొటో షూట్ న‌చ్చ చేస్తోంది. దీనికి సంబంధిచిన క్రేజీ తార‌ల ఫొటోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌త ఏడాది చేసిన‌ట్టే ఈ ఏడాది కూడా బాలీవుడ్ ఫేమ‌స్ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నానీ 2020 క్యాలెండ‌ర్ కోసం ఫొటో షూట్‌ని నిర్వ‌హించాడు.

గ‌త 25 ఏళ్లుగా ఆయ‌న బాలీవుడ్ తార‌ల‌తో క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ఫొటో షూట్‌ల‌ని నిర్వ‌హిస్తున్నారు. అయితే గ‌త కొంత కాలంగా ఈ ఫొటో షూట్‌ని మ‌రింత స్పైసీగా చేసి హీటెక్కించ‌డంతో దేశ వ్యాప్తంగా దీనికి పాపులారిటీ వ‌చ్చింది. దీంతో డ‌బ్బూ ర‌త్నానీ ఫొటో షూట్ క్యాలెండ‌ర్ అన‌గానే నెటిజ‌న్స్‌తో పాటు  అభిమానులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఐశ్వ‌ర్యారాయ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్‌, హృతిక్ రోష‌న్‌, కియారా అద్వానీ, విక్కీ కౌష‌ల్‌, సైఫ్ అలీఖాన్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, కృతి స‌న‌న్‌, విద్యాబాల‌న్‌, స‌న్నీలియోన్‌, భూమి ఫ‌డ్నేక‌ర్ ల‌తో చేసిన ఫొటో షూట్ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తోంది.

ముఖ్యంగా విద్యాబాల‌న్ పోజులిచ్చిన ఫొటోల‌కు యూత్ ఫిదా అయినోతున్నారు. అందాల విందు చేస్తూ విద్యాబాల‌న్ మరింత హీటెక్కించేస్తోంది. తెర‌పై హోమ్లీ గాళ్ గా చీరక‌ట్టులో క‌నిపించే విద్యాబాల‌న్ మోడ్ర‌న్ డ్రెస్సులో అందాల విందు చేస్తూ క‌నిపించ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. విద్యా హాటు పోజులు చూసిన వాళ్లంతా రెచ్చిపోయిందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

This is my 2020 #DabboRarnani calendar shot ?… @dabbooratnani @manishadratnani #dabbooratnanicalendar #btswithdabboo

A post shared by Vidya Balan (@balanvidya) on