డేటింగ్ లైఫ్ బోర్ కొడితేనే పెళ్లి?


Vignesh sivan intaresting comments on dating with Nayanatara
Vignesh sivan intaresting comments on dating with Nayanatara

ప్రేమించిన అమ్మాయి దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకోవాల‌ని చాలా మంది చూస్తుంటారు. కానీ విగ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జోడి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా క‌నిపిస్తున్నారు. గ‌త కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట షికార్లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇప్ప‌టికే ఈ జంట ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ జంట పెళ్లి ఇంకా కాలేద‌ని, పెళ్లికి ముందు గ్ర‌హ దోష పూజ‌లు చేస్తున్నార‌ని త‌మిళ మీడియా వెల్ల‌డించింది.

తాజాగా త‌మ పెళ్లి వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు ద‌ర్శ‌కుడు, న‌య‌న్ ల‌వ‌ర్ విగ్నేష్ శ‌వ‌న్ స్పందించారు. `మా పెళ్లిపై ఎప్ప‌టిక‌ప్పుడు పుకార్లు వ‌స్తూనే వున్నాయ‌ని, వృత్తి ప‌రంగా తాము సాధించాల్సినవి చాలానే వున్నాయ‌ని, వాటిని త‌ప్ప తాము పెళ్లి గురించి ఆలోచించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అంతేనా డేటింగ్ లైఫ్‌‌పై బోర్ కొట్టిన‌ప్పుడు మాత్ర‌మే తామిద్ద‌రం పెళ్లి చేసుకుంటామ‌ని, అంత వ‌ర‌కు పెళ్లి గురించి ఆలోచించ‌మ‌ని చెప్పి షాకిచ్చాడు.

ఇటీవ‌ల త‌మ‌కు కోవిడ్ 19 సోకిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయ‌ని, అవి త‌మ‌ని బాధించాయ‌ని అన్నారు. ఇప్ప‌టికే న‌య‌న‌తాకు మీడియా 22 సార్లు వివాహం చేసింద‌ని, మీడియా వార్త‌ల‌పై సెటైర్లు వేశాడు. అయితే విగ్నేష్ స‌మాధానం విన్న వాళ్లంతా డేటింగ్ త‌రువాత మ‌న‌సు మారితే న‌య‌న‌తార ప‌రిస్థితేంట‌ని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. పెళ్లి అంటే ఓ భ‌ద్ర‌త అని, అది లేకుండా డేటింగ్ లైఫ్‌ని ఏళ్ల త‌ర‌బ‌డి ఎంజాయ్ చేస్తూనే వుంటామ‌ని విగ్నేష్‌ శివ‌న్ చెప్ప‌డం విడ్డూరంగా వుంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.