బిచ్చగాడు హీరో కాశితో హిట్ కొడతాడా


vijay antony hopes on kaasi

బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించిన బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ . బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి అయితే అవేవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు కాకపోతే బిచ్చగాడు ప్రభావంతో కొంత వరకు ఓపెనింగ్స్ రాబట్టాయి దాంతో విజయ్ ఆంటోనీ చిత్రాలకు ఇంకా డిమాండ్ ఉంది . దాంతో తాజాగా కాశి చిత్రాన్ని కూడా దక్కించుకోవడానికి పలువురు పోటీ పడ్డారు . రకరకాల వివాదాల అనంతరం ఈరోజు విడుదలకు సిద్దమయ్యింది కాశి చిత్రం .

బిచ్చగాడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం విజయ్ ఆంటోనీ చాలా కష్టాలు పడుతూనే ఉన్నాడు కానీ ఆ స్థాయి విజయం మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు . అయితే ఈ కాశి చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ . ఈరోజు తెలుగులో అలాగే తమిళ్ లో విడుదల అవుతోంది , మరి బిచ్చగాడు లా కాశి చిత్రం విజయం సాధిస్తుందా ? లేక మిగతా చిత్రాల్లాగే కాశి కూడా చేరి పోతుందా చూడాలి .