అట్లీ – విజయ్ ల సినిమా రేపే ప్రారంభం


Vijay atlee new movie starts from tomorrow

తమిళ స్టార్ హీరో విజయ్అట్లీ ల కాంబినేషన్ లో మూడో చిత్రం రేపే ప్రారంభం కానుంది . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో తేరి , మెర్సల్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి . దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . హ్యాట్రిక్ కోసం విజయ్ – అట్లీ మళ్ళీ జత కడుతున్నారు . ఈ సినిమా విజయ్ కి 63 వ సినిమా కావడం విశేషం .

క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ గా కనిపించనున్నాడు . విజయ్ సరసన నయనతార నటిస్తోంది . ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు . రేపు చెన్నై లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యే ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయనున్నారు . తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ కానుంది ఈ చిత్రం .

English Title: Vijay atlee new movie starts from tomorrow