మనకి సూపర్ స్టార్ – స్టైలిష్ స్టార్..వారికి యువ తలైవాలు విజయ్ – కార్తీ….


మనకి సూపర్ స్టార్ - స్టైలిష్ స్టార్..వారికి యువ తలైవాలు విజయ్ - కార్తీ....
మనకి సూపర్ స్టార్ – స్టైలిష్ స్టార్..వారికి యువ తలైవాలు విజయ్ – కార్తీ….

100 రోజుల ముందు ఉన్న సంక్రాంతికి మన తెలుగు సినిమాలు రెండు పోటీ పడుతున్నాయి అని మనం విన్నాం కదా. అందులో ప్రిన్స్ సూపర్ స్టార్ ‘మహేష్ బాబు – సరిలేరు నీకెవ్వరూ’ అలాగే స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్ – అలా వైకుంఠపురములో’ సినిమాలు ఉన్నాయని మనం ఇప్పటినుండే వాటి మీద ఆసక్తి కనబరుస్తున్నాం. కానీ రేపు రాబోయే దీపావళి పండగకి తమిళ సినిమాల నుండి రెండు వాటికి అవే పోటీకి దిగుతున్నాయి.

ఇక ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటే మొదట ‘బిగిల్ (విజిల్)’ సినిమా గురించి మాట్లాడుకోవాలి. దర్శకులు ‘అట్లీ‘ మరియు యువ తలైవా ‘విజయ్’ గారిది మంచి కలయిక. ముందు విడుదల అయిన రెండు సినిమాలు తమిళ, తెలుగులో బాగా విజయం అందుకున్నాయి. అందుకే ఈ మూడవ సినిమాకి బాగా ఆదరణ లభిస్తుంది. ‘ఏ.ఆర్.రెహమాన్’ గారు సంగీత దర్శకులు, నయనతార కథా నాయిక. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకే సారి అనగా ఈ నెల 27 న విడుదల చేస్తున్నారు.

రెండవ సినిమా ‘కార్తీ శివకుమార్’ నటించిన ‘ఖైదీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ జనాలకి బాగా నచ్చింది. తెలుగు తమిళంలో ఖైదీ పేరుతో ఒకేసారి సినిమాని బిగిల్ సినిమాకి పోటీగా రెండు రోజుల ముందుగానే విడుదల చెయ్యాలి అని ఈ నెల 25 న విడుదల తేదీ ప్రకటించేశారు. చూసుకుంటే బిగిల్ సినిమాకంటే ఎక్కువగా ఓట్లు ఖైదీ సినిమాకి వేస్తున్నారు. యూట్యూబ్ లొ విజయ్ బిగిల్ సినిమాకి బాగా ఆదరణ ఉన్నప్పటికీ కార్తీ ఖైదీ సినిమా విభిన్నం. ఎందుకంటే కార్తీ ఖైదీ సినిమాలో ఒక్క పాట కానీ, నవ్వించే సన్నివేశం కానీ, హీరోయిన్ తో రొమాన్స్ కానీ అవేమీ ఉండవు. సినిమా మొత్తం ఎక్కడి నుండి మొదలు అయ్యిందో అలాగే సాగుతూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక మన తెలుగు ప్రేక్షకులు కొంతమంది సినిమా సెంటిమెంట్ ని ఫాలో అవుతారు కాబట్టి విజయ్ బిగిల్ సినిమా మీద నమ్మకం తక్కువగానే ఉంది. కారణం సినిమాలో బాలీవుడ్ నటులు ‘జాకీ ష్రాఫ్’ గారు నటించడమే అంటున్నారు. అవును జాకీ ష్రాఫ్ గారి మన తెలుగు సినిమాలో కనబడితే ఆ సినిమా ఆడటం కష్టమే అంటున్నారు. అలా ఆ సెంటిమెంట్ అనేది కార్తీ ఖైదీ సినిమా విషయానికి తోడైంది. పైగా సినిమా మధ్యలో పాటలు, వగైరా సన్నివేశాలకి విసిగిపోయిన వారు ఖైదీ సినిమాలో అవేమి లేవని తెలిసి సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు.

ఒకవేళ విజయ్ బిగిల్ సినిమా విజయం సాధిస్తే సెంటిమెంట్ ని తిప్పికొట్టిందని అంటారే తప్ప కార్తీ ఖైదీ సినిమాకి అడ్డు కాదు అంటారు. ఒకవేళ కార్తీ ఖైదీ సినిమా విజయ్ బిగిల్ సినిమాకి పోటీగా గెలిస్తే షరా మామూలే (జాకీ ష్రాఫ్) అంటారు. ఇంకొక రీజన్ కూడా ఉంది అదేమిటి అంటే అంత పెద్ద విజయ్ సినిమాకి చిన్న హీరో సినిమా విజయం సాధిస్తే మంచిదే కదా అంటారు. ఎటూ చూసుకున్న కార్తీ ఖైదీ సినిమా ఇప్పటికే సగం గెలిచింది. ఇంకా 25, 27 తేదీల వరకు వెయిట్ చేస్తే చాలు మనం కూడా ఆ పోటీలో ఎవరు గెలిచారో చెప్పవచ్చు.