రౌడీ ఫ్యాన్స్ కోసం స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

రౌడీ ఫ్యాన్స్ కోసం స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!
రౌడీ ఫ్యాన్స్ కోసం స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న చిత్రం `లైగ‌ర్‌`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈమూవీ ద్వారా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ బాట ప‌డుతున్నారు.

ఈ మూవీ నుంచి అప్ డేట్ వ‌చ్చి చాలా రోజుల‌వుతోంది. ఇదే సంర్భంలో ఈ నెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా అయినా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఏమైనా ఇస్తారా అని విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌త రెండు రోజులుగా స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మా హీరో పుట్టిన రోజు సంద‌ర్భంగా `లైగ‌ర్‌` అప్‌డేట్ ఇవ్వండ‌ని ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. వారి రిక్వెస్ట్‌ని గ‌మ‌నించిన పూరి ఈ నెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు సంద‌ర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కి స‌ర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టైటిల్‌, ఫ‌స్ట్ లుక్, రిలీజ్ డేట్ వ‌చ్చేసింది కాబ‌ట్టి పుట్టిన రోజున `లైగ‌ర్‌` టీజ‌ర్‌ని రిలీజ్ చేసే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.