సవాల్ ని స్వీకరించిన విజయ్ దేవరకొండ


vijay devarakonda accepts harithaharam green challengeగీత గోవిందం తో సంచలన విజయం సాధించిన విజయ్ దేవరకొండ నగర మేయర్ బొంతు రామ్మోహన్ విసిరిన సవాల్ ని స్వీకరించాడు . హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే ! అందులో భాగంగా హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హీరో విజయ్ దేవరకొండకు ఛాలెంజ్ విసిరాడు దాంతో ఇన్ని రోజుల తర్వాత ఆ సవాల్ ని స్వీకరించి ఈరోజు మొక్కలు నాటాడు ఈ హీరో . కాకినాడ కు చెందిన తన అభిమానులతో కలిసి మొక్కలు నాటడమే కాకుండా వాళ్లతో కలిసి భోజనం చేసి మరికొంతమందికి అంటే తన రౌడీ గ్యాంగ్ కి సవాల్ విసిరాడు .

తన అభిమానులను రౌడీలని పిలుచుకుంటారు హీరో విజయ్ దేవరకొండ . దాంతో నన్ను ఫాలో అవ్వండి మొక్కలు నాటండి రౌడీలు అంటూ ట్వీట్ చేసాడు . గీత గోవిందం తో ప్రభంజనం సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలపై దృష్టి కేంద్రీకరించాడు. టాక్సీ వాలా , నోటా చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి మరి ఈ సినిమాలు విజయ్ ని ఎలా చూపిస్తాయో చూడాలి .

English Title: vijay devarakonda accepts harithaharam green challenge