నవంబర్ లో విజయ్ దేవరకొండ  కొత్త చిత్రం


Vijay Devarakonda and Puri Jagannadh film Starts from November
Vijay Devarakonda and Puri Jagannadh film Starts from November

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం నవంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ  నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే మాస్ కి మంచి కిక్ ఇచ్చే సినిమా రావడం ఖాయమని అంటున్నారు . ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరి జగన్నాధ్ .

ఇక డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్లాప్ ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ . డియర్ కామ్రేడ్ కొట్టిన దెబ్బకి తనకు పూరి లాంటి డైరెక్టర్ అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట . ఇక ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది అంటే 2020 ప్రథమార్థం లోనే ఈ సినిమా విడుదల కానుందన్న మాట .