విజయ్ దేవరకొండకు ఆ టైటిల్ నచ్చిందట


Vijay Devarakonda
Vijay Devarakonda

డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి ” ఫైటర్ ” అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నారు పూరి అండ్ కో . ఇక ఈ టైటిల్ విజయ్ దేవరకొండకు కూడా బాగా నచ్చిందట దాంతో అదే టైటిల్ ని కన్ఫర్మ్ చేసే పనిలో పడ్డారట చిత్ర బృందం.

ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో చేయడానికి సిద్దమయ్యాడు. తన మార్క్ మాస్ టేకింగ్ కి విజయ్ దేవరకొండ లాంటి క్రేజ్ హీరో కరెక్ట్ అని అప్పుడే దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నాడట పూరి.

విజయ్ దేవరకొండ కూడా తనకు పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడైతేనే పక్కా మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తే తప్పకుండా ఆ క్రేజ్ మరోలా ఉంటుందని భావిస్తున్నాడు. డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ తో ఈ నిర్ణయం తీసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇస్మార్ట్ శంకర్ తో గాడిలో పడిన పూరి విజయ్ కి హిట్ ఇస్తాడా ? లేక దెబ్బ కొడతాడా ? చూడాలి.