విజయ్ దేవరకొండది ఓవరాక్షనట


Vijay Devarakonda and Rashmika Mandanna conversation goes viralవిజయ్ దేవరకొండ ని ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తోంది హీరోయిన్ రష్మిక మండన . ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తాజాగా విజయ్ దేవరకొండ సరసన ” గీత గోవిందం ” చిత్రంలో నటిస్తోంది . అయితే ఇటీవలే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి చిత్రంలో అత్యుత్తమ నటన ప్రదర్శించినందుకు గాఈ అవార్డు అందుకున్నాడు.

అయితే బెస్ట్ యాక్టర్ అయిన నేపథ్యంలో శుభాకాంక్షలు అందజేసింది రష్మిక దానికి ఆ అవార్డులదేముంది అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ మీతో గడపడమే నిజమైన అవార్డు అంటూ హీరోయిన్ ని కాకాపడుతుండటంతో ఓవరాక్షన్ తగ్గించుకో గోవిందం ….. అసలు ఈ అవార్డు నీకు కాకుండా ఎన్టీఆర్ కో ప్రభాస్ కో ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ క్లాస్ పీకుతోంది రష్మీక. విజయ్ దేవరకొండ కు అవార్డు వచ్చిన నేపథ్యంలో హీరో – హీరోయిన్ ల మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . గీత గోవిందం ని పరిచయం చేయడానికి ఈ అవార్డు కాన్సెప్ట్ ని వాడుకున్నారు ఆ చిత్ర బృందం .