అర్జున్ రెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందా?

అర్జున్ రెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందా?
అర్జున్ రెడ్డి కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందా?

టాలీవుడ్ కు సంబంధించి అర్జున్ రెడ్డి కల్ట్ క్లాసిక్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా బోలెడంత క్రేజ్ ను సాధించారు. ఇప్పటికీ వీరిద్దరి ప్రస్తావన వస్తే కచ్చితంగా అర్జున్ రెడ్డి చర్చకు వస్తుంది. దాని ప్రభావం అలాంటిది.

అర్జున్ రెడ్డి కాంబోను మళ్ళీ రిపీట్ చేయాలని చాలా మంది ప్రయత్నించారు కానీ కుదర్లేదు. ఈ నేపథ్యంలో మరోసారి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబోను సెట్ చేసే పనిలో ఉంది. రీసెంట్ గా విజయ్, సందీప్ ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేసే విషయమై చర్చించుకున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. మరో వైపు సందీప్ రెడ్డి రన్బీర్ కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సమాయత్తమవుతున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి.