విజయ్ దేవరకొండ -తరుణ్ భాస్కర్ ల టైటిల్ ఇదే నట


Vijay devarakonda and Tharun bhascker gets new title
పెళ్లి చూపులు చిత్రంతో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండదాస్యం తరుణ్ భాస్కర్ లు కలిసి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు . అయితే ఈసారి హీరో దాస్యం తరుణ్ భాస్కర్ కాగా నిర్మాతగా మారుతున్నాడు విజయ్ దేవరకొండ . హాట్ భామ అనసూయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రనికి టైటిల్ ఏంటో తెలుసా …….” మీకు మాత్రమే చెప్తా ”.

 

మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు విజయ్ దేవరకొండ . దాంతో ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ అని తెలుస్తోంది . ఈ సినిమా కోసం దాస్యం తరుణ్ భాస్కర్ లావు తగ్గాడు అలాగే గడ్డం తీసేసాడు కూడా . మొత్తానికి దర్శకుడైన తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . పెళ్లిచూపులు చిత్రంతో తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ కోసం ఈ సాహసం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఇందులో అనసూయకు మంచి  పాత్ర లభించిందట .

 

English Title: Vijay devarakonda and Tharun bhascker gets new title