ఆంధ్రా యువకుడిగా విజయ్ దేవరకొండ


Vijay devarakonda as andhra fighterపెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి చిత్రాలలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన హీరో విజయ్ దేవరకొండ . ఇక అర్జున్ రెడ్డి లో అయితే ఏకంగా అగ్రెసివ్ గా నటించి భీబత్సం సృష్టించాడు . ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగింది . అనూహ్యమైన క్రేజ్ కూడా సొంతం అయ్యింది దాంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు దర్శక నిర్మాతలు . తాజాగా ఈ హీరో నటించిన గీత గోవిందం విడుదలకు సిద్ధం అవుతుండగా సెట్స్ పైకి మరో సినిమాని తెచ్చేసాడు . ఇక ఆ కొత్త సినిమాలో ఈ తెలంగాణ హీరో ఆంధ్రా యువకుడిగా నటిస్తున్నాడు .

సినిమాకు ప్రాంతం , బాష తేడా లేదు అయితే తెలంగాణ స్లాంగ్ ని అద్భుతంగా పలికే విజయ్ దేవరకొండ ఆంధ్రా స్లాంగ్ ని ఎలా పలుకుతాడో ? ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి . ఏందుకంటె భాష ఒక్కటే అయినప్పటికీ మాండలికాలు వేరు . రాయలసీమ యాస వేరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల యాస వేరు , ఉత్తరాంధ్ర , తెలంగాణ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడతారు తెలుగు భాష ని . ఇక ఇప్పుడు ఆంధ్రా యువకుడిగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ” డియర్ కామ్రేడ్ ” ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ఉప శీర్షిక . భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు ఈహీరో . ఉభయ గోదావరి జిల్లాలలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది .

English Title: vijay devarakonda as andhra fighter