ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ


vijay devarakonda as chief minister in nota

భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన విష్యం తెలిసిందే . వేసవిలో విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది కాగా ఇప్పుడు మరో యువ హీరో ముఖ్యమంత్రి గా నటించనున్నట్లు తెలుస్తోంది . ఇంతకీ ముఖ్యమంత్రి గా నటిస్తున్న హీరో ఎవరో తెలుసా …… విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా తెలుగు , తమిళ బాషలలో రూపొందుతున్న ” నోటా ” చిత్రంలో నటిస్తున్నాడు .

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ దేవరకొండ కొత్త తరహాలో కనిపించనున్నాడని తెలుస్తోంది . ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా కు ఓటు వేసే హక్కు తాజాగా కల్పించింది ఎన్నికల సంఘం . దాంతో ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది .

యువతలో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా అలరిస్తాడా చూడాలి . మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రి గా కనిపించి ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నాడు కాగా విజయ్ ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురు చూడాల్సిందే .