విజయ్ దేవరకొండ లేబర్ లీడర్ ?


Vijay devarakonda as Labour Leader

విజయ్ దేవరకొండ తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్ లు . దాంతో అవాక్కవడం జనాల వంతు అవుతోంది . సినిమా ప్రారంభంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ లను ఎంపిక చేసారు , ఇక ఇప్పుడేమో మరో హాట్ భామ కేథరిన్ ట్రెసా ని ఎంపిక చేసారు అలాగే మరో మోడల్ ని కూడా హీరోయిన్ గా తీసుకున్నారట దాంతో మొత్తం హీరోయిన్ ల సంఖ్య 4 కు చేరింది .

ఒక్క సినిమాలోనే నలుగురు హీరోయిన్ లు , ఆ నలుగురి హీరోయిన్ లతో విజయ్ దేవరకొండ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండనుందో మరి . లేబర్ లీడర్ గా ఈ చిత్రంలో నటిస్తున్నాడు . ఇక ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు కానీ కథానుగుణంగా  లేబర్ లీడర్ అనే టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారట చిత్ర బృందం . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణి కార్మికుడి పాత్రలో నటిస్తున్నాడు .

English Title: Vijay devarakonda as Labour Leader