విజయ్ దేవరకొండ తమ్ముడు కొట్టాడు హిట్టు


vijay deverakonda dorasani movie
vijay deverakonda dorasani movie

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కొట్టాడు హిట్టు . నిన్న విడుదలైన దొరసాని చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా నెటిజన్ల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి . అసలు టీజర్ , ట్రైలర్ చూసి ఆనంద్ దేవరకొండపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది . ఆ చూపు ఏంటి ? యాక్టింగ్ ఏంటి ? ఆ అప్పియరెన్స్ ఏంటి ? అంటూ అసలు ఆనంద్ దేవరకొండ హీరో మెటీరియాలా ? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి .

అయితే సినిమా విడుదల అయ్యాక ఆ విమర్శలన్నీ దూది పింజ లా తేలిపోయాయి . ఎందుకంటే రాజు అనే క్యారెక్టర్ కి తగ్గట్లుగా నటించి మెప్పించాడు ఆనంద్ దేవరకొండ . దాంతో విజయ్ దేవరకొండ తమ్ముడ్ని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు . దొరసాని చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . ముఖ్యం గా తెలంగాణలో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చేలా ఉన్నాయి .