విజయ్ దేవరకొండ తమ్ముడు సక్సెస్ కొడతాడా ?


విజయ్ దేవరకొండ తమ్ముడు  సక్సెస్ కొడతాడా ?
Shivatmika and Anand Deverakonda

విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరో అవుతున్న విషయం తెలిసిందే . టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు దాంతో ఈ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా పరిచయం చేస్తున్నారు దొరసాని చిత్రంతో . హీరో డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు . తెలంగాణ ఇతివృత్తంతో తెరకెక్కిన దొరసాని చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి .

దొరసాని సినిమా విజయం విజయ్ దేవరకొండ తమ్ముడికి అలాగే రాజశేఖర్ కూతురు కి కూడా కీలకమే ! అయితే విజయ్ దేవరకొండ స్థాయిలో ఆనంద్ దేవరకొండ ఆకట్టుకుంటాడా ? విజయం సాధిస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . హీరోల తమ్ముళ్లు చాలామందే హీరోలుగా వచ్చారు కానీ సక్సెస్ అయ్యింది మాత్రం జస్ట్ వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మంది మాత్రమే ! మరి విజయ్ దేవరకొండ తమ్ముడు ఏ లిస్ట్ లో చేరతాడో తెలియాలంటే దొరసాని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే . a