కార్ ఛేజింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ


vijay devarakonda
vijay devarakonda

డియర్ కామ్రేడ్ దెబ్బకి ఒక్కసారిగా డీలా పడిపోయిన క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ దానినుండి కోలుకొని ఇమ్మీడియట్ గా తన నెక్స్ట్ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు.

ఓనమాలు ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్సియల్స్ బ్యానర్ పై ప్రముఖ సీనియర్ నిర్మాత కెయస్ రామారావు నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 48 చిత్రం శరవేగంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రంకోసం విజయ్ దేవరకొండ , జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది పైటర్స్ పై కణల్ కన్నన్ నేతృత్వంలో కార్ ఛేజ్ సీన్స్, ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు.. గత నాలుగురోజులుగా ఫిలింసిటీలోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

డిసెంబర్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రాశి కన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ చిత్రం తరువాత విజయ్ పూరి దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటించనున్నారు.. ఇందులో బాక్సర్ గా విజయ్ కనిపించనున్నారని తెలిసింది.. ఇస్మార్ట్ శంకర్ లో నటించిన హీరోయిన్స్ నిధి అగర్వాల్, నాభా నటేష్ లలో ఒకరిని హీరోయిన్ గా పెట్టుకొనే ఛాన్స్ ఉందని సమాచారామ్..! విజయ్ దేవరకొండ ఫిలిం న్యూస్