విజయ్ దేవరకొండ అసలు పేరు ఏంటో తెలుసా


Vijay devarakonda changes his screen name

తెలుగులో క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ . పెళ్ళి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి సంచలన చిత్రాలతో యువతలో క్రేజీ స్టార్ అయ్యాడు అయితే నోటా చిత్రంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు విజయ్ దేవరకొండ . ఇక అసలు విషయానికి వస్తే …….. విజయ్ దేవరకొండ అసలు పేరు తెలుసా …….. పూర్తీ పేరు తెలుసా …….. విజయ్ సాయి దేవరకొండ . అవును ఈ హీరో పూర్తిపేరు విజయ్ సాయి దేవరకొండ అయితే ఇన్నాళ్ళు తన పేరుని విజయ్ దేవరకొండ గానే స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడు కానీ తాజాగా మాత్రం విజయ్ సాయి దేవరకొండ అని టైటిల్స్ లో వచ్చేలా పెట్టుకున్నాడు . ఇంతకీ ఇన్ని రోజుల తర్వాత తన పేరుని ఎందుకు మార్చుకున్నాడో తెలుసా …….

ఇటీవలే రాజకీయ నేపథ్యంలో రూపొందిన నోటా చిత్రం ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . దాంతో షాక్ కి గురయ్యాడు విజయ్ దేవరకొండ ఇంకేముంది ఎవరో జాతకరీత్యా అని సలహా ఇచ్చినట్లున్నారు అందుకే తన పేరుని విజయ్ సాయి దేవరకొండ అని మార్చుకున్నాడు . తాజాగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కే ఎస్ రామారావు నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టొరీ చిత్రంతో తన పేరు మార్చుకున్నాడు ఈ హీరో . ఇన్నాళ్ళు విజయ్ దేవరకొండ కాగా ఇకనుండి విజయ్ సాయి దేవరకొండ .

English Title: Vijay devarakonda changes his screen name