సైనికుల కోసం సహాయం అందించిన విజయ్ దేవరకొండ


Vijay devarakonda contribution for soldiers

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘోర ఉగ్ర దాడిలో 42 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే . అయితే ఈ సంఘటనతో యావత్ భారత జాతి పాక్ పై భగ్గుమంటోంది . ఇక వీర జవాన్ల కు అండగా ఉంటామని పలువురు ప్రతిన బూనుతున్నారు కాగా హీరో విజయ్ దేవరకొండ మాత్రం మిగతా వాళ్ళ లా పోస్ట్ పెట్టకుండా వీర జవాన్ల సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బు పంపించి తన హీరోయిజాన్ని చాటుకున్నాడు .

 

అయితే ఎంత మొత్తం అనేది మాత్రం వెల్లడించలేదు ఈ హీరో . జాతి యావత్తు హాయిగా నిద్ర పోతోంది అంటే అందుకు కారణం సరిహద్దులో భద్రతా బలగాల త్యాగమే అంటూ వారే నిజమైన హీరోలు అంటూ కీర్తిస్తున్నారు యావత్ భారతీయులు . ఇక విజయ్ దేవరకొండ కూడా వీర సైనికులే నిజమైన హీరోలు అంటూ కీర్తిస్తూ తన వంతు సహాయంగా ఆర్ధిక సహాయం ని అందించాడు . అంతేకాదు దాని తాలూకు రిసిప్ట్ ని కూడా ట్వీట్ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ . ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో సహాయాన్ని అందించాడు ఈ హీరో .

 

English Title: Vijay devarakonda contribution for soldiers