తమిళ్ లో కూడా సత్తా చాటుతున్న గీత గోవిందం


vijay devarakonda crage in kollywood alsoగీత గోవిందం చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆదరణ లభిస్తుందనుకుంటే పొరపాటు ఓవర్ సీస్ తో పాటుగా తమిళనాట కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రానికి తమిళనాట కూడా తెలుగువాళ్ళ తో పాటుగా తమిళ ప్రజలు ఆదరిస్తున్నారు . ఒక్క రోజులోనే కోటి కై పైగా వసూళ్లు వచ్చాయి మొత్తానికి దాదాపుగా 3 కోట్లు వసూల్ అయ్యాయి తమిళనాట . తెలుగు చిత్రాలకు తమిళనాట కూడా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే .

తెలుగులో అగ్ర హీరోలు నటించిన చిత్రాలన్నీ తమిళనాడు లో కూడా విడుదల అవుతుంటాయి అయితే అగ్ర హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ ఉంటాయి కానీ వాటికీ భిన్నంగా విజయ్ దేవరకొండ కు కూడా అక్కడ ఫాలోయింగ్ బాగానే ఉంది . దాంతో మొదటి రోజునే కోటి కి పైగా కలెక్షన్లు వచ్చాయి . అదే జోరు రెండో రోజు , మూడో రోజు కొనసాగడంతో మూడు రోజుల్లో 3 కోట్ల వసూళ్లు వచ్చాయి దాంతో విజయ్ దేవరకొండ కు కూడా అగ్ర హీరోలతో సమానంగా ఇమేజ్ వచ్చిందని , ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని అంటున్నారు .

English Title: vijay devarakonda crage in kollywood also