నిర్మాతగా దేవరకొండ తొలి సినిమా.. మహేష్ ప్రమోషన్


నిర్మాతగా దేవరకొండ తొలి సినిమా.. మహేష్ ప్రమోషన్
నిర్మాతగా దేవరకొండ తొలి సినిమా.. మహేష్ ప్రమోషన్

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ చిత్రం మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ చేసిన హడావిడి అందరికీ గుర్తుండే ఉంటుంది. తనదైన స్పీచ్ తో అందరినీ అలరించాడు విజయ్. ఈసారి మహేష్ బాబు సహాయం కోరాడు విజయ్. నిర్మాతగా మారి విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న మొదటి చిత్రం మీకు మాత్రమే చెప్తా, నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల కానుంది. మహేష్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్ దేవరకొండ ట్రైలర్ ను లాంచ్ చేయమనడం, మహేష్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. అందుకే ఈరోజు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ ను లాంచ్ చేస్తాడు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు.

ఒక విభిన్న కాన్సెప్ట్ తో పూర్తి ఎంటర్టైన్మెంట్ వే లో ప్రేక్షకులను అలరించేదిగా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. నూతన దర్శకుడు సమీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.