ఫ్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ


Vijay devarakonda escape from gangsters

విజయ్ దేవరకొండ లక్కీ ఎందుకంటే ఇప్పటికే నోటా చిత్రంతో ఫ్లాప్ మూట గట్టుకున్నాడు కాగా మరో ఫ్లాప్ దానికంటే ముందే వచ్చేది కానీ ఎందుకో ఆ సినిమా చేయలేదు దాంతో అది గ్యాంగ్ స్టార్స్ గా వెబ్ సిరీస్ రూపంలో వచ్చింది . ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం కంటే ముందే ఫ్లాప్ మూట గట్టుకొని ఉండేవాడు . అయితే అతడికి అదృష్టం వరించింది కాబట్టే ఆ సినిమా చేయకుండా ఊరుకున్నాడు కట్ చేస్తే వెబ్ సిరీస్ గా తీసుకొచ్చారు స్వప్న దత్ అండ్ కో . విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే సినిమాగా వచ్చేది వీలయితే దానికి త్రివిక్రమ్ పనిచేసేవాడట .

గీత గోవిందం వంటి సంచలన విజయం తర్వాత విజయ్ దేవరకొండ చేసిన నోటా అట్టర్ ఫ్లాప్ అయ్యింది దాంతో షాక్ అయ్యాడు ఈ హీరో . అయితే నోటా రిజల్ట్ కొంతమందికి సంతోషాన్ని ఇచ్చిందని , కొంతమంది పార్టీ కూడా చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు . దానిపై విమర్శలు వచ్చాయి . ఇక ఇప్పుడేమో టాక్సీ వాలా సినిమా విడుదలకు సిద్దమయ్యింది . నవంబర్ 16 న ఆ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మరి టాక్సీ వాలా ఏమౌతుందో .

English Title: Vijay devarakonda escape from gangsters