విజయ్ దేవరకొండ టార్గెట్ పెద్దదే !


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ పెద్ద టార్గెట్ ని ముందు పెట్టుకున్నాడు . డియర్ కామ్రేడ్ చిత్రంతో దక్షిణాది లోని నాలుగు బాషలలోకి ఎంటర్ అవుతున్నాడు . ఇప్పటికే నోటా చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించాడు ఈ క్రేజీ హీరో , అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మాత్రం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసా ….. తన మార్కెట్ ని దక్షిణాదిన మొత్తం పెంచుకోవడానికి . ఇక నుండి విజయ్ దేవరకొండ నటించిన ప్రతీ సినిమాని సౌత్ లోని నాలుగు బాషలలో విడుదల చేయడం ద్వారా మెల్లి మెల్లిగా తన మార్కెట్ పెరుగుతుందని ఆశపడుతూన్నాడు . ఏకంగా వంద కోట్ల ని టార్గెట్ గా పెట్టుకున్నాడు ఇప్పుడు . మెల్లి మెల్లిగా దాన్ని 150 కోట్ల మేరకు పెంచుకోవాలని పెద్ద కల కంటున్నాడు మరి ఈ కల సాకారం అవుతుందా ? డియర్ కామ్రేడ్ రిలీజ్ అయితే కానీ తెలీదు .