సిక్స్ ప్యాక్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ


Vijay Devarakonda
Vijay Devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ కి సిద్ధం అవుతున్నాడు . త్వరలోనే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . విజయ్ దేవరకొండ కు రౌడీ ఇమేజ్ ఉంది అలాగే మాస్ దర్శకుడు పూరి తన హీరోలకు మరింత మాస్ ఇమేజ్ వచ్చేలా చూపించడంలో అందెవేసిన చేయి అనే చెప్పాలి . పైగా పూరి హీరోలకు సిక్స్ ప్యాక్ అన్నది కామన్ పాయింట్ గా మారింది దాంతో విజయ్ దేవరకొండ ని కూడా సిక్స్ ప్యాక్ లో చూపించడానికి ఫిక్స్ అయ్యాడట పూరి .

ఇక విజయ్ దేవరకొండ కూడా సిక్స్ ప్యాక్ చేసే ఆలోచనలు ఉన్నాడట . అసలే రౌడీ హీరో ఆపై సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే అది కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అంటే మాటలా ? ఊర మాస్ ప్రేక్షకులకు కావాల్సినంత మసాలా అన్నమాట . ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో పూరి జగన్నాధ్ లో సరికొత్త జోష్ వచ్చింది . ఆ జోష్ తో విజయ్ దేవరకొండ తో సినిమాకు రెడీ అవుతున్నాడు .