ప్రభాస్ మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు . ప్రభాస్ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటన కంటే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటనే కబీర్ సింగ్ లో బాగుందని చెప్పడమే! ఇటీవలే కబీర్ సింగ్ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే . అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్ ఈ కబీర్ సింగ్ కాగా విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర ని హిందీలో షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు .

ఇంకా షూటింగ్ పూర్తికాలేదు కానీ అప్పుడే విజయ్ దేవరకొండ కంటే షాహిద్ కపూర్ బాగా నటించాడు అని తెగ వైరల్ అయ్యేలా మాట్లాడుతున్నారు . దానికి ప్రభాస్ కామెంట్స్ కూడా ఆజ్యం పోశాయి . షాహిద్ కు ప్రభాస్ ఫోన్ చేసి విజయ్ దేవరకొండ కంటే బాగా చేసావ్ అని మెచ్చుకోవడం , అది బయటకు లీక్ కావడంతో ప్రభాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . కబీర్ సింగ్ జూన్ 21న రిలీజ్ కానుంది . ఇంకా రిలీజ్ కానీ సినిమాలో షాహిద్ కపూర్ నటన గురించి మాట్లాడటం ఏంటి ? అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ .