టాక్సీ వాలా తో హిట్ కొడతాడాVijay devarakonda fear with Taxiwala

నోటా చిత్రంతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఇప్పుడు టాక్సీ వాలా చిత్రంపైనే ఉన్నాయి . కొత్త దర్శకుడు రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు యువి క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టాక్సీ వాలా . అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకుండానే మొత్తం సినిమా లీకయ్యింది . దాంతో తీవ్ర తర్జన భర్జనలు అనంతరం ఆరునెలల గ్యాప్ తర్వాత విడుదల చేస్తున్నారు . హర్రర్ , కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ భారీగా ఆశలు పెట్టుకున్నాడు అంతేకాదు ఈ సినిమా కొంతమంది జీవితాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి దయచేసి ప్రేక్షకులు అంతా పైరసి ని ప్రోత్సహించకుండా థియేటర్ లలోనే సినిమా చూడాలని విజ్ఞప్తి చేసాడు .

అప్పుడే పైరసి సినిమా ని చాలామంది చూసి టాక్సీ వాలా ప్లాప్ అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు దాంతో విజయ్ దేవరకొండ ఇంకా కసిగా ఉన్నాడు . అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిడిల్ ఫింగర్ చూపించాడు పైరసీదారులకు . ఈనెల 17 న టాక్సీ వాలా విడుదల కానుంది . దాంతో బయటకు చాలా గంభీరంగా కనబడుతున్నప్పటికీ లోలోన మాత్రం భయపడుతూనే ఉన్నాడు విజయ్ దేవరకొండ . టాక్సీ వాలా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న అనుమానం ఉంది విజయ్ కి .

English Title: Vijay devarakonda fear with Taxiwala