మహేష్ ఎన్టీఆర్ లను సవాల్ చేస్తున్న విజయ్ దేవరకొండ


Vijay Devarakonda
Vijay Devarakonda

మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లను సవాల్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా ఈ హీరో టాలీవుడ్ లో క్రేజీ హీరో అయిన విషయం తెలిసిందే . సైమా అవార్డుల వేటలో విజయ్ దేవరకొండ ఉన్నాడు . తాజాగా సైమా అవార్థుల వేడుక ఆగస్టు 15 , 16 తేదీలలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా అవార్డుల వేటలో మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లతో పాటుగా రెండు విభాగాలలో పోటీ పడుతున్నాడు విజయ్ దేవరకొండ .

ఉత్తమ చిత్రం కేటగిరిలో అలాగే ఉత్తమ నటుడు అవార్డు కేటగిరి లలో విజయ్ దేవరకొండ తన గీత గోవిందం చిత్రంతో పోటీ ఇస్తున్నాడు మిగతా హీరోలకు . భరత్ అనే నేను చిత్రంతో మహేష్ బాబు పోటీ పడుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో , రంగస్థలం చిత్రంతో రాంచరణ్ పోటీ పడుతున్నారు . మరి ఈ నలుగురిలో సైమా అవార్డు కొట్టేది ఎవరో ?