పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ


Puri-Jagannadh-and-Vijay-Devarakonda
Puri-Jagannadh-and-Vijay-Devarakonda

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇటీవలే డియర్ కామ్రేడ్ చిత్రంతో ఘోరంగా దెబ్బతిన్నాడు విజయ్ దేవరకొండ దాంతో భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడట ఈ హీరో . సరిగ్గా అదే సమయంలో పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో తనని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసేది పూరి మాత్రమే అని బలంగా నమ్మాడట !

అందుకే పూరి కి ఛాన్స్ ఇచ్చాడని , అయితే ఆ సినిమా ఇప్పుడే కాదని బహుశా వచ్చే ఏడాది ఉండోచ్చని అంటున్నారు . పూరి జగన్నాధ్ మాస్ కి విజయ్ దేవరకొండ క్రేజీ ఇమేజ్ కు సరైన కథ దొరకాలి కానీ బాక్సాఫీస్ బద్దలై పోవడం ఖాయం . మొత్తానికి ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ క్రేజే వేరు .