అర్జున్ రెడ్డి తమిళంలో రిలీజ్ కి రెడీ


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గా తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు . అదేంటి అర్జున్ రెడ్డి చిత్రం ఆల్రెడీ విడుదల అయ్యింది కదా ! పైగా అక్కడ రీమేక్ అవుతొంది కదా అని అనుకుంటున్నారా ? తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ” ద్వారకా ” చిత్రాన్ని తమిళంలో ” అర్జున్ రెడ్డి ” గా డబ్ చేస్తున్నారు . ఇక ఈ సినిమాని ఈనెల 26 న రిలీజ్ చేయనున్నారు .

ద్వారకా చిత్రం తెలుగులో 2017 లో రిలీజ్ అయ్యింది కానీ హిట్ కాలేదు కానీ విజయ్ దేవరకొండ కు విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమాని అక్కడ డబ్ చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు . ఆల్రెడీ నోటా చిత్రంతో విజయ్ దేవరకొండ కు తమిళంలో మంచి మార్కెట్ ఏర్పడింది దాంతో అర్జున్ రెడ్డి గా ద్వారకా ని విడుదల చేస్తున్నారు . విజయ్ దేవరకొండ – పూజా ఝవేరి జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , మురళీశర్మ తదితరులు నటించారు . ఈ సినిమా ఎలాగూ అక్కడ కూడా హిట్ కాదు కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఓ మాదిరి వసూళ్లు సాధించడం ఖాయం .