రౌడీ హీరోని ఇంకా రియ‌ల్ మెన్‌గా చూడ‌ట్లే..!


రౌడీ హీరోని ఇంకా రియ‌ల్ మెన్‌గా చూడ‌ట్లే..!
రౌడీ హీరోని ఇంకా రియ‌ల్ మెన్‌గా చూడ‌ట్లే..!

టాలీవుడ్ ‌క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రికి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. అంద‌రిని మించి ఆలోచిస్తుంటాడ‌న్న‌ది ఇటీవ‌ల చాలా సంద‌ర్భాల్లో స్ఫ‌ష్ట‌మైంది. స్టార్స్ అంతా లాక్ డౌన్ పిరియ‌డ్‌లో ఇంటికే ప‌రిమిత‌మైన వేళ విజ‌య్  దేవ‌ర‌కొండ క‌మీష‌న‌రేట్‌కి వెళ్లి పోలీస్‌ల‌తో క‌లిసి రెండు మూడు రోజుల పాటు వారిలో ఉత్సాహాన్ని నింప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

తాజాగా మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ బి ద రియ‌ల్ మెన్ ఛాలెంజ్ విష‌యంలోనూ భిన్నంగా స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బి ద రియ‌ల్ మెన్ ఛాలెంజ్ వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ ఈ ఛాలెంజ్‌ని ప్రారంభించి రాజ‌మౌళిని నామినేట్ చేశారు.

ఆ త‌రువాత ఎన్టీఆర్ నుంచి మొద‌లైన ఈ ఛాలెంజ్ చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున‌, బాల‌కృష్ణ‌ల వ‌ర‌కు వెళ్లింది. ఇందులో చిరు, వెంక‌టేష్ మాత్ర‌మే టాస్క్ ని కంప్లీట్ చేశారు. నాగార్జున‌, బాల‌కృష్ణ‌ల కోసం చ‌ర్చ న‌డుస్తోంది. ఇదిలా వుంటే ఎన్టీఆర్ నామినేట్ చేయ‌డంతో లైన్‌లోకి వ‌చ్చిన కొర‌టాల శివ గురువారం టాస్క్‌ని కంప్లీట్ చేసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని నామినేట్ చేశారు.

దీనికి విజ‌య్ ఇచ్చిన స‌మాధానం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  `శివ సార్ మా అమ్మ న‌న్ను ప‌ని చేయ‌నియ‌ట్లే. చేస్తే ప‌ని డ‌బుల్ అవుతుందంట‌. ఇంట్లో ఇంకా మ‌మ్మ‌ల్ని రియ‌ల్‌మెన్‌గా చూడ‌ట్లే.  ఇప్ప‌టికీ పిల్ల‌లానే ట్రీట్ చేస్తున్నారు. అయినా ఈ లాక్‌డౌన్ పిరియ‌డ్‌లో ఓ రోజుని మీకు త‌ప్ప‌కుండా చూపిస్తాను` అని స‌మాధానం చెప్ప‌డంతో అంతా స‌ర‌దాగా న‌వ్వుకుంటున్నారు.

Credit: Twitter