టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ


టాలీవుడ్ హీరోలకు షాక్ ఇచ్చి సంచలనం సృష్టించాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . టైమ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో టాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టి మరీ 4 వ స్థానంలో నిలిచాడు ఈ క్రేజీ హీరో . దేశ వ్యాప్తంగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందున్నాడు దాంతో ఈ నాల్గవ స్థానం దక్కించుకున్నాడు .

అయితే ప్రభాస్ బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా పేరు మార్మ్రోగిన విషయం తెలిసిందే . కట్ చేస్తే బాహుబలి క్రేజ్ తగ్గిపోయింది కాబట్టి ప్రభాస్ తన స్థానాన్ని కోల్పోయి 12 వ స్థానంకు దిగజారాడు . విజయ్ దేవరకొండకు తెలుగులోనే పాపులారిటీ కానీ అది దేశ వ్యాప్తం అవుతుండటం సంతోషించతగ్గ పరిణామమే ! మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కు 4 వ స్థానం రాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ” ఫర్ ఎవర్ డిజైరబుల్ మెన్” గా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాడు .